హార్దిక్ ఒక 'ప్లాస్టిక్ కెప్టెన్': శ్రీకాంత్

  • ఐపీఎల్ లో 9వ స్థానానికి పడిపోయిన ముంబై ఇండియన్స్
  • ముంబై పరిస్థితికి పాండ్యా చెత్త కెప్టెన్సీ కారణమన్న శ్రీకాంత్
  • హార్ధిక్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని సూచన

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఆయన సంధించిన విమర్శలు ముంబై అభిమానుల్లో చర్చకు దారితీశాయి.


ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయిన ముంబై పరిస్థితికి హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీయే కారణమని ఆయన మండిపడ్డారు. హార్దిక్‌ను ఒక 'ప్లాస్టిక్ కెప్టెన్'గా అభివర్ణించిన శ్రీకాంత్, మైదానంలో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు జట్టును నట్టేట ముంచుతున్నాయని విమర్శించారు. కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా హార్దిక్ తన సహజసిద్ధమైన ఆటను ఆడలేకపోతున్నాడని, అతడిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తేనే స్వేచ్ఛగా రాణించగలడని అభిప్రాయపడ్డారు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇప్పటికైనా మేనేజ్‌మెంట్ మేల్కొని, వెంటనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని శ్రీకాంత్ సంచలన సూచన చేశారు.


Hardik Pandya
Mumbai Indians
Krishnamachari Srikkanth
IPL 2026
Rohit Sharma
IPL
Cricket
Plastic Captain
Mumbai Indians Captaincy
Indian Premier League

More Telugu News